వర్షాకాలంలో తేమ శాతం అధికంగా వుంటుంది. ఈ కాలంలో కేశాల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ వుండాలి. ఈ కాలంలో సహజసిద్ధమైన హెన్నా ప్యాక్ వేసుకుంటే మంచిది. ఇది కండిషనింగ్ ఏజెంటుగా పనిచేసి జుట్టును మృదువుగానూ ఆరోగ్యంగా వుంచుతుంది. ఐదు చెంచాల హెన్నా పొడికి మూడు చెంచాల టీ డికాక్షన్, కోడిగుడ్డు తెల్లసొన, అరచెక్క నిమ్మరంస, చెంచా చొప్పున మెంతిపొడి, ఉసిరిపొడి కలిపి మూడు గంటలు నానబెట్టాలి.