బీట్‌రూట్ జ్యూస్‌తో అందం..

గురువారం, 23 మార్చి 2023 (14:52 IST)
చర్మ కాంతిని- ఆరోగ్యాన్ని పెంచే పదార్థాలలో బీట్‌రూట్ ఒకటి. ఇందులో ఉండే పోషకాలు చర్మాన్ని బాగా మెయింటెయిన్ చేయడానికి సహాయపడుతాయి. యాక్నే, బ్లాక్ హెడ్స్ వంటి చర్మ సమస్యలను బీట్‌రూట్‌తో సులభంగా నయం చేయవచ్చు.
 
బీట్‌రూట్ జ్యూస్‌లో రెండు భాగాలు, ఒక భాగం నీళ్లలో కలిపి చర్మంపై రాసుకుంటే దురదలు, చికాకులు తొలగిపోతాయి. ఒక టేబుల్ స్పూన్ బీట్ రూట్ రసంలో ఒక టీస్పూన్ నిమ్మరసం మిక్స్ చేసి రాత్రి పడుకునే ముందు ముఖానికి అప్లై చేయాలి. 
 
20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో మీ ముఖాన్ని కడగాలి. ఇలా రోజూ చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది. ఒక టేబుల్ స్పూన్ బీట్ రూట్ జ్యూస్‌లో కొంచెం పంచదార మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి సున్నితంగా స్క్రబ్ చేయాలి. తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. 
 
ఇలా వారానికోసారి చేస్తే ముఖంపై ఉన్న నల్లటి మచ్చలు క్రమంగా పోతాయి. బీట్‌రూట్ రసంలో తేనె, పాలు కలిపి ముఖానికి మాస్క్‌లా వేసుకుంటే చర్మం పొడిబారడం తగ్గుతుంది. రాత్రి నిద్రపోయే ముందు బీట్‌రూట్ రసాన్ని పెదవులపై అప్లై చేయడం వల్ల పెదాలు నలుపు, ఎరుపు త్వరగా పోతాయి

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు