మహిళలకే సమయం లేదు.. పురుషులకు ఫర్వాలేదు!

సోమవారం, 22 డిశెంబరు 2014 (14:30 IST)
తాజా అధ్యయనంలో జనరేషన్ మారుతున్నా మహిళలపైనే ఒత్తిడి, బాధ్యతలు పెరిగిపోతున్నాయని, పురుషులకు ధీటుగా అన్నీ రంగాల్లో రాణిస్తున్నా.. మహిళలపై అధిక భారం ఉందని తేలింది. ఆఫీసులో పనిచేసే మగవారితో పోలిస్తే.. సెలవుల్లో వారాంతాల్లో మహిళలకు దొరికే విశ్రాంతి సమయం చాలా తక్కవని తాజా అధ్యయనంలో తేలింది. 
 
ఆడవారితో పోలిస్తే మగవారు వ్యక్తిగతంగా కేటాయించుకునే సమయం ఐదు గంటలు అదనంగా ఉంటుంది. ఏదేశంలో చూసుకున్నా పెళ్లయిన మహిళల్లో 50 శాతం మంది వంట వండిపెట్టడం, పిల్లలకు ఒంట్లో బాగా లేకపోతే చూసుకోవడం మన బాధ్యతగా భావిస్తారట. 
 
ఉద్యోగం చేసే వాళ్లు కూడా దాన్ని తమ వ్యక్తిగత సమయంగానే అనుకుంటారు. కానీ ఇలా అనుకునే మగవాళ్లు 9 శాతం మంది మాత్రమే ఉంటారని తాజా అధ్యయనంలో తేలింది.

వెబ్దునియా పై చదవండి