మహిళలకు గృహాలంకరణల చిట్కాలు

సోమవారం, 21 మే 2018 (14:42 IST)
గృహాలంకరణ కోసంగానీ, వ్యక్తుల వాడకం కోసంగానీ ఎంతో ఖరీదు పెట్టి ఇష్టపడి కొనుకున్న వస్తువులను భద్రపరచుకునే విషయంలో ఏ మాత్రం అశ్రద్ధ వహించినా అవి త్వరగా పాడవుతాయి. కాబట్టి చిన్నపాటి జాగ్రత్తలను తీసుకున్నట్లయితే వాటిని భద్రంగా ఉంచుకోవచ్చు. ఇందుకోసం చేయాల్సింది ఏంటంటే... 
 
పాత కాలం నుంచీ, ఇప్పటిదాకా ప్రతి ఇళ్లలోనూ వంటగదిలో స్టౌ మీది నుంచి వేడి పాత్రలను దించేందకు చాలామంది పాత బట్టలను వాడటం పరిపాటి. అయితే ఇతీవలి కాలంలో పట్టకారు లాంటివి వాడకంలోకి వచ్చినా, ఎక్కువమంది మాత్రం పాత నూలు బట్టలను వాడటం మాత్రం ఆపటం లేదు. ఇలా వాడటం తప్పుకాదు కానీ, వాటిని కూడా ప్రతిరోజూ శుభ్రంగా ఉతికి వాడాల్సి వస్తుంది.
 
వంటపాత్రలను పట్టుకునేందుకు వాడే వస్త్రాలలో వందల కోట్ల సూక్ష్మక్రిములు పెరుగుతున్నాయనీ, ఇవే ఆహారం కలుషితం కావడానికి ప్రధానంగా కారణమవుతున్నాయని పరిశోధకులు తెలిపారు. అందుకే పాత బట్టలను ప్రతిరోజూ వేడినీటిలో సర్ఫ్ వేసి నానబెట్టి ఉతికి బాగా ఎండలో ఆరబెట్టాలని పరిశోధకులు సూచిస్తున్నారు.
 
ఫర్‌ఫ్యూమ్‌లు, క్రీముల్లాంటివి తరచుగా వార్డ్ రోబ్‌లు తెరచినప్పుడల్లా పడిపోయి ఒలికిపోతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే వెడల్పాటి  ఎలాస్టిక్‌ను తీసుకుని డ్రా లోపలి భాగంలో పిన్నుల సాయంతో రెండు కొనలకు బిగుతుగా అమర్చి సీసాలన్నింటినీ ఎలాస్టిక్ లోపలివైపు పెడితో పడిపోకుండా ఉంటాయి.
 
అలాగే ఖరీదైన దుస్తులపై మురికి, దుమ్మూ ధూళీ చేరకుండా ఉండాలంటే, నూలు వస్త్రంతో కుట్టిన గలేబు కవర్లు లాంటి వాటిని దుస్తులకు తొడిగితే సరిపోతుంది.  షూలు, చెప్పుల జతలు అన్నింటినీ ఒకేచోట కుప్పలాగా పడవేయకుండా వాటిని కొన్నప్పుడు వచ్చిన అట్టపెట్టెలను భద్రపరచి వాటిల్లోనే అందంగా సర్దిపెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల వాటిని గుర్తించటం సులభం అవటమేగాకుండా ఇల్లు కూడా చూసేందుకు అందంగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు