పువ్వుల చెట్లను? నాటడం ఎలా?

శుక్రవారం, 1 జూన్ 2018 (17:47 IST)
మనుష్యులకు ఆరోగ్యం ఎంత ముఖ్యమో అదేవిధంగా మెుక్కలకు ఆరోగ్యం అంత ముఖ్యం. మెుక్కలు పెంచాలనుకునే వారు వాటిపై కాస్త శ్రద్ధ పెట్టగలిగితే అవి ఆరోగ్యంగా అందంగా ఎదుగుతాయి. అందుకు మీరు తీసుకోవలసి కొన్ని జాగ్రత్తలు.
 
మెుక్కల్ని కుండల్లో నాటేటప్పుడు దాని అడుగున ఒక ప్లేట్ తప్పనిసరిగా ఉంచాలి. అప్పుడు మీరు పోసేనీళ్లు మట్టిని చెల్లా చెదురు కాకుండా, నీళ్లు బయటకు రాకుండా ఉంటాయి. మీరు ఏ మెుక్కనైతే నాటుతున్నారో దానికి రోజుకు ఎన్నిసార్లు నీరు అందించాలనే విషయాలను బాగా తెలుసుకోవాలి. అప్పుడే పోషకాలు ఆ మెుక్కలలో ఎక్కువగా ఉంటాయి.
 
అప్పుడప్పుడు మెుక్కలపై భాగంలో ఉండే మట్టిని పదునైన వస్తువులతో గుల్లగా చేయాలి. ఇలాచేయడం వల్ల మెుక్క వేళ్లనుంచి గాలినీ, దాన్నుంచి పోషకాలనూ సులభంగా గ్రహించగలుగుతుంది. తేమ ఎక్కువగా అవసరమయ్యే మెుక్కలకు మట్టిలో కోకోపీట్ కలపడం చాలా ముఖ్యం. మీరు నాటేది పువ్వులు మెుక్కలు ఐతే పువ్వులు పూశాక అలానే వదిలేయకుండా ప్రూనింగ్ చేసుకోవడం మంచిది. నాటిన మెుక్కలలో ఎండిపోయిన కొమ్మలను, ఆకులను కూడా కత్తిరించుకుంటే కొత్త చిగురు ఏర్పడుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు