మహిళలకు మేలు చేసే మల్లె పువ్వులు.. అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా..?

సెల్వి

బుధవారం, 22 జనవరి 2025 (10:35 IST)
మల్లెపూలు అంటే దేవతా పూజలకి, స్త్రీలు తలలో పెట్టుకోడానికి మాత్రమే ఉపయోగిస్తారు. అయితే దీనితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జలుబు, దగ్గు, కడుపు నొప్పి, నిద్రలేమిని తగ్గిస్తుంది. మల్లె పువ్వు జ్యూస్‌ని గోరువెచ్చని నీటితో కలిపి తాగడం వల్ల కడుపులోని నులిపురుగులను అణిచివేసేందుకు మేలు చేస్తుంది. 
 
మల్లె ఆకుల వేరు రసాన్ని బియ్యం కడిగిన నీరు, పంచదార కలిపి తాగితే వికారం నుండి ఉపశమనం లభిస్తుంది. మల్లెపువ్వులు శిరస్సున ధరించడం ద్వారా మహిళలకు శారీరక, మానసిక సమస్యలను దూరం చేస్తుంది. ఒత్తిడిని దూరం చేస్తుంది. గుప్పెడు మల్లెపువ్వులను గట్టిగా పీల్చుకుంటే మనసు హాయిగా జరుగుతుంది. 
 
మల్లెపువ్వులను మహిళలు తలలో పెట్టుకోవడం ద్వారా జుట్టు రాలకుండా వుంటాయి. జుట్టు పెరుగుతుంది. అలాగే మల్లెపువ్వులతో టీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది పచ్చకామెర్లకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. మల్లె ఆకులతో చేసే మందులు మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్‌ను దూరం చేస్తుంది. ఇంకా జాస్మిన్ ఆయిల్ చలికాలంలో ఏర్పడే కీళ్ల నొప్పులకు ఎంతో మేలు చేస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు