రాగులతో మేలెంతో? జుట్టు పెరగాలంటే.. రాగితో తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకోండి

శనివారం, 10 డిశెంబరు 2016 (14:44 IST)
రాగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పిన్నల నుంచి పెద్దల వరకు రాగులతో ఎంతో ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఇందులో క్యాల్షియం పిల్లల సక్రమ ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతాయి. జుట్టు పెరుగుదలకు, మధుమేహ వ్యాధి నియంత్రణకు రాగులు మెరుగ్గా పనిచేస్తాయి. డయాబెటిస్ పేషెంట్లకు రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీయాలు చక్కని ఔషధంగా పనిచేస్తాయి. 
 
రాగిపిండితో తయారైన ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. రాగులలో అయోడిన్‌ పుష్కలంగా లభిస్తుంది. ఎదిగే పిల్లలకు పాలల్లో రాగులను వేయించి పొడిచేసిన పిండిని కలిపి త్రాగించినట్లైతే వారి ఎదుగుదల బాగుంటుంది. 
 
రాగులు కడుపులో మంటను తగ్గించి, చలువ చేస్తాయి. పైత్యాన్ని తగ్గిస్తుంది. వృద్ధులకు రాగులు బలాన్నిస్తాయి. ఇంకా మహిళలు ఎముకలపటుత్వానికి రాగులతో తయారుచేసిన రాగి మాల్ట్‌ను తాగడం మంచిది. రాగి మాల్ట్ ఎముకల పటుత్వానికి ధాతువుల నిర్మాణాని కి తోడ్పడుతుంది. రాగిమాల్ట్ తాగినట్లైతే మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా నివారించుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి