గోర్లు కొరికే అలవాటుందా? ఇక ఆపండి.. లేదంటే?

సోమవారం, 16 జనవరి 2017 (12:46 IST)
గోర్లు కొరికే అలవాటుందా..? అయితే వెంటనే ఆపండి.. లేకుంటే చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు తప్పవు. ఈ అలావాటు కూడా దంత సమస్యలు కూడా వస్తాయని డెంటిస్టులు ఎప్పటినుంచో చెప్తూనే వున్నారు. గోర్లను కొరకడం ద్వారా గోటిలోని మురికి శరీరంలోనికి పోతుంది. తద్వారా ఈ-కోలీ లాంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా గోటినుంచి బాడిలోకి వెళుతుంది.
 
గోర్లు కొరకడం మానసిక ఆందోళనకు సూచన అని మానసిక నిపుణులు చెబుతారు. ఇది ఆరోగ్యకరమైన మానసిక స్థితిని కూడా అపదలోకి నెట్టేస్తుందని హెచ్చరిస్తుంటారు. ఓరల్ సమస్యలు, దురదృష్ణం ఎక్కువైతే క్యాన్సర్‌ని కూడా మోసుకొస్తుంది ఈ అలవాటు. కాబట్టి గోర్లు కొరకడం ఆపండి.

వెబ్దునియా పై చదవండి