తనకు ఇష్టమైన కారును కొనుగోలు చేసి దాన్ని గోడౌన్‌లో ఉంచినందుకు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రోజుకు రూ.2400 (28 డాలర్లు) చొప్పున అపరాధం చెల్లించారు. ఈ విషయం తాజగా వెలుగులోకి వచ్చింది. పైగా, తాను ఇష్టపడిన కారును రోడ్లపైకి నడిపేందుకు ఏకంగా 13 యేళ్లు ఎదురూచాడాల్సి వచ్చింది.
బిల్ గేట్స్ 1988లో పోర్షే 959 అనే అరుదైన స్పోర్ట్స్ కారును కొనుగోలు చేశారు. ప్రపంచంలో ఇలాంటి కార్లు కేవలం 337 మాత్రమే ఉన్నాయి. అయితే, ఈ కారు అమెరికాలోని రోడ్ల భద్రతా నియమాలకు, కాలుష్య నిబంధనలకు అనుగుణంగా లేకపోవడంతో దీన్ని దేశంలోకి అనుమతించలేదు.
దాంతో గేట్స్ తన కలల కారును 13 ఏళ్లపాటు ఒక గోడౌన్‌లో ఉంచాల్సి వచ్చింది. ఈ సమయంలో, రోజుకు 28 డాలర్ల (రూ.2,400) చొప్పున జరిమానా చెల్లించారు. మొత్తం మీద లక్షా 32 వేల డాలర్లకు పైగా జరిమానా కట్టారు.
ఈ సమస్యను పరిష్కరించడానికి గేట్స్, ఆపిల్ సహ-వ్యవస్థాపకుడు స్టీవ్ వోజ్నియాక్‌తో కలిసి అమెరికా కాంగ్రెస్‌ను సంప్రదించారు. వారి కృషి ఫలితంగా 1999లో "షో ఆర్ డిస్‌ప్లే" అనే కొత్త నిబంధన వచ్చింది. ఇది చారిత్రాత్మకంగా లేదా సాంకేతికంగా ముఖ్యమైన వాహనాలను కొన్ని పరిమితులతో దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తుంది.
ఈ నిబంధన వచ్చాక, 2001లో బిల్ గేట్స్ తన పోరే కారును చట్టబద్ధంగా నడపడం మొదలుపెట్టారు. అప్పటితో ఆయన జరిమానాల కష్టాలు తీరాయి. గేట్స్ చేసిన ఈ ప్రయత్నం కేవలం ఆయన కోసమే కాదు, భవిష్యత్తులో కార్ల సేకరణదారులు, విద్యాసంస్థలు, మ్యూజియంలకు కూడా ఇలాంటి అరుదైన కార్లను దిగుమతి చేసుకునే మార్గాన్ని సుగమం చేసింది.