రాత్రిళ్లలో ఆలస్యంగా నిద్రపోతే.. డి విటమిన్ లోటే!

మంగళవారం, 3 నవంబరు 2015 (18:11 IST)
రాత్రిళ్లు ఏ అర్థరాత్రికో.. ఓ పది గంటలకు పైనో నిద్రపోతున్నారా? అయితే మీ శరీరంలో విటమిన్ డి లోపం తప్పదంటున్నారు.. ఆరోగ్ నిపుణులు. సాధారణంగా రాత్రిళ్లు నిద్రపోవడం ఆలస్యం, ఉదయం మేల్కోవడం ఆలస్యం. లేచాక ఆఫీసుకో, కాలేజికో టైం అయిపోతుందంటూ ఉరుకులు పరుగులు పెట్టడం. కాస్త అటుఇటు తేడాగా దాదాపు అందరిదీ ఇదే జీవనశైలి. దీనివల్లే భారతీయుల్లో విటమిన్-డి కొరత ఏర్పడుతోందని తాజా అధ్యయనాల్లో తేలింది. 
 
మనదేశ జనాభాలో 84 శాతం మందిలో విటమిన్-డి కొరత ఉంది. కీళ్ల నొప్పులు, కండరాల బలహీనత, హృదయ కోశ వ్యాధులకు ఈ లోపమే కారణం. అందుకే తరచూ శరీరంలో విటమిన్-డి నిల్వలను పరీక్షించుకోవాలి. రోజూ కొద్దిసేపు శరీరంపై సూర్యరశ్మి పడేలా చూసుకోవాలి. లేకపోతే ప్రమాదమని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుచేత రోజూ సాయంత్రం ఓ పావు గంట అలా సూర్యరశ్మి శరీరానికి తగిలేలా తిరిగితే ఎంతో బెటరని వారు సూచిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి