వెంట్రుకలు తెల్లబడటానికి కారణాలు ఇవే...

సోమవారం, 5 నవంబరు 2018 (10:06 IST)
స్త్రీపురుషుల అందాన్ని ద్విగుణీకృతం చేయడంలో జుట్టుది ప్రధాన పాత్ర. ఈ వెంట్రుకలు ముఖారవిందాన్ని మరింతగా రెట్టింపు చేస్తాయి. అయితే, ఎంతటి అందాన్నైనా బట్టతల, తెల్లజుట్టు దెబ్బతీస్తాయి. చిన్నవయసులోనే జుట్టు తెల్లబడినా, బట్టతల వెక్కిరిస్తున్నా నలుగురిలో తిరగాలంటే నామోషీగా భావిస్తారు. 
 
నల్లని జుట్టు తెల్లగా మారడానికి ప్రధాన కారణం కాలుష్యంతో పాటు మానసిక ఒత్తిడి. ఇతరత్రా సమస్యలను చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో చిన్నవయసులోనే బట్టతల, జుత్తు తెల్లబడిపోతుండడం చాలామంది కుర్రాళ్లను ఆందోళనకు గురిచేస్తోంది. సమస్య ఏమిటో అర్థంకాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
 
అయితే మారిన జీవన విధానం, కాలుష్యం సమస్యే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. గడచిన పదేళ్లలో జుట్టు రాలే సమస్య 80 శాతం పెరిగినట్లు పలు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కింగ్‌జార్జి ఆస్పత్రిలోని డెర్మటాలజీ విభాగానికి వచ్చే ఓపీలో 10 నుంచి 20 శాతం మంది ఈ రెండు సమస్యలతోనే బాధపడుతున్నవారే కావడం గమనార్హం. 
 
అసలు జుట్టు తెల్లబడటానికి కారణాలు ఏంటో ఓసారి పరిశీలిద్ధాం. 
* అతి చల్లని నీటితో తల స్నానం చేయకూడదు. వాయు, నీటి కాలుష్యాలు సమస్యకు కారణం.
* తల స్నానానికి ఏ షాంపూ దొరికితే దాన్నే వినియోగించడం నష్టదాయకం. 
* షాంపూల్లో ఉండే సోడియం హైడ్రాక్సీ వెంట్రుకలను తెల్లగా చేయడంతో పాటు జుట్టును పొడిబార్చి రాలిపోయేలా చేస్తుంది.
* హార్మోన్ల అసమతౌల్యం వల్ల జుట్టు రాలడం, తెల్లబడే అవకాశం ఉంది.
* జంక్‌ఫుడ్‌లో వినియోగించే కొన్ని రసాయనాలు జుట్టుపై ప్రభావం చూపుతాయి.
* సమయానికి భోజనం, నిద్ర లేకపోవడం, ఒత్తిడితో కూడిన ఉద్యోగం వల్ల జుట్టు రాలుతుంది.
* శరీరానికి అవసరమైన విటమిన్స్‌ లోపమున్నా ఈ రెండు సమస్యలు కనిపిస్తాయి. 
* ప్రధానంగా వెంట్రుకలు బలంగా ఉండేలా చేసే మెగ్నీషియం, కాల్షియం, ఐరన్‌ లోపం వల్లే ఎక్కువ మంది ఈ సమస్య బారిన పడుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు