అయిదేళ్ల తర్వాత పెళ్లాడతా: బ్రిట్నీ

సోమవారం, 1 డిశెంబరు 2008 (20:17 IST)
బ్రిట్నీ స్పియర్స్ ప్రేమను ఇప్పటికీ వదిలినట్లు లేదు. ఇప్పటికే రెండు భగ్న వివాహాలను చవిచూసిన బ్రిట్నీ తిరిగి పెళ్లికి సిద్ధమేనని అంటోంది. అయితే మరింత నిలకడైన వ్యక్తిని, తన పిల్లలకు మంచి తండ్రిగా ఉండే వ్యక్తిని మాత్రమే తాను పెళ్లాడతానని చెబుతోంది.

మరో ఐదేళ్లలో తాను పెళ్లాడవచ్చని, తన పిల్లలకు తండ్రి అవసరం ఉందని, సంరక్షకుడు, నిలకడైన వ్యక్తి భర్తగా వస్తే బావుంటుందని బ్రిట్నీ చెబుతోంది. గ్లామర్ మేగజైన్‌కు ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కాబోయే భర్త సల్లక్షణాలను గురించి ఈ పాప్ సుందరి ఏకరువు పెట్టింది.

వెబ్దునియా పై చదవండి