ప్రపంచ సుందరి అంచుల దాకా...

WD
మన దేశానికి చెందిన పార్వతి ఒమన కుట్టన్ ప్రపంచ సుందరి కిరీటాన్ని కొద్దిలో చేజార్చుకుని రెండో స్థానంలో నిలబడింది. రష్యాకు చెందిన సెన్యా సుఖినోవా కిరీటాన్ని గెలుచుకుంది. వెండి కాంతుల ధగధగల నడుమ 58వ ప్రపంచ సుందరి పోటీలు శనివారం దక్షిణాఫ్రికాలోని జోహన్స్‌బర్గ్‌లో జరిగాయి.

కేరళ రాష్ట్రానికి చెందిన పార్వతి ప్రపంచ సుందరి కిరీటాన్ని ఎగరేసుకొస్తుందని చాలా మంది అనుకున్నారు. అయితే జడ్జిలు అడిగిన ప్రశ్నలకు రష్యా సుందరి మరింత చురుకుగా స్పందించి ప్రపంచ సుందరి కిరీటాన్ని కైవసం చేసుకుంది.

ఫలితంపై పార్వతి ఇలా స్పందించారు..." సెమీ ఫైనల్‌లో చివరిదాకా నా పేరు చదవకపోవడంపై కాస్తంత ఉత్కంఠకు లోనయ్యా. అయితే సెమీ‌ఫైనల్లోకి ప్రవేశించిన తర్వాత ప్రపంచ సుందరి కిరీటాన్ని తప్పక గెలుచుకుంటాననుకున్నా. కానీ చేజారిపోయింది. అయినా చింతించడం లేదు. ఫైనల్ రౌండ్‌లోకి ప్రవేశించినందుకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు ఇంతుకు మించిన బహుమతిని నాకివ్వదలుచుకున్నాడేమో"

మొత్తంమీద ప్రపంచవ్యాప్తంగా సుమారు వందకోట్ల మంది ఆయా టెలివిజన్ ఛానళ్లలో ఈ అందాల పోటీలను వీక్షించారు. ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకునేందుకు చివరి వరకూ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇచ్చిన పార్వతికి అనేక మంది తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి