అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని.. మాజీ మిస్ ఇండియా, బాలీవుడ్ యాక్టర్ పరేష్ రావత్ సతీమణి, నటీమణి, టీవీ ఆర్టిస్ట్ స్వరూప్ రావల్ గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఆమె ఉపాధ్యాయురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా ఈమె ప్రపంచంలోనే అత్యుత్తమ ఉపాధ్యాయుల జాబితాలో స్థానం సంపాదించుకుంది.
బ్రిటన్‌కు చెందిన వర్కీ ఫౌండేషన్ ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఉన్నత సేవలు అందించే ఉపాధ్యాయులను అవార్డుల కోసం ఎంపిక చేస్తుంది. ఇంకా వారికి అవార్డులను కూడా ప్రదానం చేస్తుంది. ఈ క్రమంలో ఈ ఏడాది అత్యుత్తమ ఉపాధ్యాయుల పురస్కారానికి 179 దేశాల నుంచి దాదాపు 10వేల మందిని సిఫార్సు చేశారు. ప్రస్తుతం వీరిలో పది మందిని వర్కీ ఫౌండేషన్ ఎంపిక చేసింది. ఈ టాప్-10 జాబితాలో భారత్‌కు చెందిన ఉపాధ్యాయురాలు స్వరూప్ రావల్ స్థానం దక్కించుకున్నారు.
ఈ అవార్డుతో పాటు ఒక మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీని కూడా ఆమెకు అందజేసింది. స్వరూప్ రావల్ 1979వ సంవత్సరం మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇంకా నటీమణిగా పలు హిందీ సినిమాలు, సీరియల్స్, ప్రకటనల్లో నటించారు. ఇక స్వరూప్ రావల్.. బీజేపీ ఎంపీ పరేష్ రావల్ సతీమణి కావడం గమనార్హం.
పెళ్లికి తర్వాత సినిమాల్లో నటించడాన్ని తగ్గించుకున్న ఆమె.. ఉపాధ్యాయురాలిగా అవతారం ఎత్తారు. పీహెచ్‌డీ ముగించిన ఆమె.. దేశంలోని పలు దేశాలకు వెళ్లి విద్యకు సంబంధించిన సేవలను చేశారు. టీచర్‌గా రాణించారు. ఈ క్రమంలోనే గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2019 అవార్డుకు ఎంపికయ్యారు. వీరి ఉపాధ్యాయ, విద్యా సేవలకు గాను.. గుజరాత్ రాష్ట్రం విద్యా పథకాల అధికారిగా స్వరూప్ రావల్‌ను నియమించింది.