అరటి గుజ్జు, పెరుగు కలిపిన మిశ్రమాన్ని..?

శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (11:42 IST)
మహిళలు శరీర సౌందర్యాన్ని పెంపొందించడం కోసం రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. కాని కొన్ని చిట్కాలు పాటిస్తే అందంగానే కాక ఆరోగ్యంగాను ఉంటారంటున్నారు ఆరోగ్యనిపుణులు. దీంతో మీ శరీర రంగులో మార్పులు సంభవించి చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. 
 
పొడిబారిన చర్మం కలవారు అరటిపండు, తేనె, పెరుగును కలిపిన మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని 15 నిమిషాల పాటు అలానే ఉంచుకోవాలి. ఇలా చేయడం వలన చర్మం గతంలోకన్నా మెరుగ్గా తయారవుతుందంటున్నారు బ్యుటిషియన్లు. 
 
మీ ముఖం ఆయిలీ స్కిన్ అయితే విటమిన్ సి (పుల్లటి పండ్లు) కలిగిన పండ్ల గుజ్జును ముఖానికి రాస్తే ఫలితం ఉంటుంది. ముఖంపై మచ్చలుంటే వాటిని తొలగించేందుకు ఒక చెంచా పసుపును పాలలో గానీ లేదా నీటిలో గానీ కలిపి సేవించండి. దీంతో మీ ముఖంపై మచ్చలు మటుమాయమవుతాయంటున్నారు ఆరోగ్యనిపుణులు. శరీరంలో ఆమ్లాలు ఎక్కువగా ఉంటే పిగ్మెంటేషన్ లేదా చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనికి ప్రతి రోజూ కొబ్బరి నీళ్లు సేవిస్తుంటే ఫలితం ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు