పచ్చి అరటికాయ ఈ 5 ప్రయోజనాలు తెలిస్తే తింటూనే వుంటారు...

ఆదివారం, 3 ఫిబ్రవరి 2019 (09:43 IST)
అర‌టిలో అనేక పోష‌క విలువ‌లు ఉన్నాయి. ఈ పండు తింటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించ‌వ‌చ్చు అని వైద్యులు చెబుతున్నారు. కేవలం పండు మాత్రమే కాదు అరటికాయ కూడా ఒంటికి ఎంతో మేలు చేస్తుంది. అరటి ఆకులో భోజనం చేస్తే తిన్నది చక్కగా అరిగి జీర్ణ సంబంధిత వ్యాధులు దగ్గరకి కూడా రావు. 
 
అరటి పండులోనే కాదు, పచ్చి అరటికాయలో కూడా అనేక ప్రయోజనాలున్నాయి. సాధారణంగా పచ్చి అరటికాయలను ఉడికించి లేదా ఫ్రై చేసి తింటుంటారు. పచ్చి అరటి పండ్లతో వివిధ రకాల అరటికాయ బజ్జీ, అరటితో గ్రేవీలు, కర్రీస్‌ను కూడా తయారుచేసుకుంటుంటారు. ఉడికించినవి ఆరోగ్యానికి మరీ మంచిది. దీని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.
 
1. ఎల్లో బనానాలు తిన్న విధంగానే పచ్చి అరటిపండ్లు తినడం వల్ల ఎనర్జిటిక్‌గా ఉండటమే కాదు. ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. పచ్చి అరటికాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఆరోగ్యం మొత్తం మెరుగుపడుతుంది. పచ్చిఅరటిలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. శరీరంలో వ్యర్థాలను బయటకు పంపిస్తుంది.
 
2. గ్రీన్ బనానాలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దాంతో మలబద్దక సమస్య ఉండదు. రోజుకు 3.6 గ్రాముల ఉడికించిన అరటికాయ తినడం వల్ల జీర్ణవ్యవస్థకు అవసరమయ్యే ఫైబర్ పొందవచ్చు.
 
3. పచ్చి అరటి పండ్లలో ఉండే స్ట్రార్చ్ కంటెంట్ శరీరంలో ఫ్యాట్ నిల్వచేరకుండా, ఇన్సులిన్ మీద ప్రభావం చూపకుండా సహాయపడుతుంది. ప్లాస్మా కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గిస్తుంది.
 
4. పచ్చి అరటి పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది నాడీవ్యవస్థను చురుగ్గాపనిచేయడానికి సహాయపడుతుంది. పచ్చి అరటికాయలో వివిధ రకాల విటమిన్స్ ఉంటాయి. విటమిన్ బి6, విటమిన్-సిలు అధికంగా ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండటానికి ఈ విటమిన్స్ చాలా  అవసరమవుతాయి.
 
5. పచ్చి అరటిపండ్లలో విటమిన్స్, మెగ్నీషియం, క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు స్ట్రాంగ్‌గా మారుతాయి. అలాగే కీళ్ల నొప్పులను కూడా నివారిస్తాయి. పచ్చి అరటిపండ్లు తినడం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీనివల్ల తరచుగా తినాలనే ఫీలింగ్ తగ్గుతుంది. దీనివల్ల బరువు పెరగడం, ఇతర అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు