దాల్చిన చెక్కను మెత్తగా పేస్టులా తయారుచేసుకోవాలి. దానిలో కొంచెం నిమ్మరసం, పసుపు కలుపుకోవాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి పట్టించి.. ముఖ్యంగా నల్ల మచ్చలున్నచోట పట్టించి సున్నితంగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వలన ముఖం కాంతివంతంగా మారుతుంది.
రాత్రి దాల్చిన చెక్క పేస్ట్ రాసుకుని ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా క్రమంగా చేస్తే నల్లమచ్చలు మూడో రోజే తగ్గడం, మరికొద్ది రోజులకు కనుమరుగవడం మీరు గమనిస్తారు. దీని కోసం మార్కెట్లో ఉండే కెమికల్స్ కలిసిన ఫేస్ క్రీములు వాడాల్సిన పనిలేదు.