3. తలస్నానం చేసిన తరువాత జుట్టును బాగా ఆరబెట్టుకోవాలి. లేదంటే టవల్‌తో తుడుచుకోవాలి. కానీ, హెయిర్ డ్రయర్‌ను మాత్రం ఎట్టిపరిస్థితుల్లో వాడకూడదు. వాడితే జుట్టు చివర్లో వెంట్రుకలు చిట్లి.. రంగుమారి.. రాలిపోతుంటాయి. దాంతో పాటు జుట్టు మృదుత్వాన్ని కోల్పోతుంది.
4. జుట్టు రాలకుండా ఉండాలంటే.. రోజువారి ఆహారంలో విటమిన్స్, మినరల్స్, వంటి ఖనిజాలు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. ఆకుకూరలు, కూరగాయలు, గుడ్లు, ఓట్స్, తృణ ధాన్యాలతో పాటు ప్రోటీన్స్, బీటా కెరోటిన్ అధిక మోతాదులో ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఇలా చేస్తే వెంట్రులకు పోషణ లభిస్తుంది. జుట్టు రాలకుండా ఉంటుంది.