మానవత్వం ఒక సముద్రం వంటిది..
సముద్రంలోని కొన్ని నీటి బిందువులు..
మురికిగా ఉన్నంత మాత్రాన సముద్రమంతా మురికిగా ఉందనుకోవడం పొరపాటు..
అందుచేత మానవత్వంపై నమ్మకం వదులుకోవద్దు..
అనేక విత్తనాలను విత్తడం ద్వారా నేల ఏ విధంగా సారవంతమవుతుందో..
అలానే.. రకరకాల విషయాలను పరిశీలించడం ద్వారా మనసు వికసిస్తుంది.
బలాన్ని స్మరించడమే బలహీనతల నుండి బయటపడే మార్గం..
కానీ, బలహీనులమని బాధపడడం కాదు..
ధైర్యమంటే కండ బలం కాదు.. గుండె బలం..
మనం భ్రాంతికి లోనైనప్పుడు..
ఒంట్లోని అత్యంత దృఢమైన కండరం కూడా వణకటం మొదలెడుతుంది..
దాన్ని వణికేలా చేసేది మన గుండేనని మర్చిపోకూడదు.
మోసం మనకి తెలివిగా ఎలా ఉండాలో నేర్పుతుంది..
జీవితం అంటేనే అనుభవాల సమ్మేళనం,
ఈ రోజు నేర్చుకున్న పాఠమే రేపటి ప్రశ్నలకి.. సమాధానం..