చర్మ సంరక్షణకు గ్లిజరిన్ చాలా ఉపయోగపడుతుంది. చర్మంపై గల జిడ్డును, మలినాలు, మేకప్‌ను తొలగిస్తుంది. చాలామంది మేకప్ వేసుకుంటారు కానీ దానిని ఎలా శుభ్రం చేయాలో తెలియదు. అందుకు గ్లిజరిన్ వాడితే మంచి ఫలితం లభిస్తుంది. గ్లిజరిన్ ఎటువంటి కెమికల్స్ ఉండవు. కనుక దీనిని నేరుగా చర్మానికి వాడొచ్చును.
మేకప్‌ని ఎలా శుభ్రం చేయాలంటే.. ముందుగా ముఖాన్ని నీళ్లతో కడుక్కోవాలి. ఆ తరువాత గ్లిజరిన్‌లో దూదిని ముంచుకుని ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మేకప్ శుభ్రంగా తొలగిపోతుంది. అలానే పాలలో కొద్దిగా గ్లిజరిన్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. రాత్రంతా అలానే ఉంచుకోవాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా, కాంతివంతంగా మారుతుంది.