వాడేసిన దోమల మేట్లు పారేయకుండా అరనిమిషం నీళ్ళల్లో ఉంచి..?

మంగళవారం, 8 జనవరి 2019 (17:30 IST)
ఇప్పుటి తరుణంలో పెన్నులు, పెన్సిళ్ళు ఎక్కువగానే ఉన్నాయి. కానీ, వీటి అవసరం తీరిపోగానే కాస్త కూడా ఆలోచించకుండా పారేస్తున్నారు. వీటిలోని ప్రయోజనాలు, ఉపయోగాలు తెలుసుకుంటే.. ఇలా చేయాలనిపించదు. అవేంటో ఓ సారి పరిశీలిద్దాం..
 
1. పనికిరాని పెన్నుల మూతలు ఆరవేసిన బట్టలకు క్లిప్పులుగా ఉపయోగపడుతాయి.
 
2. వాడేసిన దోమల మేట్లు పారేయకుండా అరనిమిషం నీళ్ళల్లో ఉంచి, బయటకు తీసి అరనిమిషం ఆరనిస్తే తిరిగి కొత్తవాటిల్లా ఉపయోగపడుతాయి.
 
3. పిల్లలు ఉపయోగించే పెన్సిళ్ళు చిన్నగా అయి, రాయడానికి పనికిరాకపోతే వాటిని జామెట్రీ బాక్సులోని వృత్త లేఖినిలో వాడుకోవచ్చును.
 
4. పాలకవర్ చింపి పాలు గిన్నెలో పోసుకున్నాక కవర్‌ని తిరగవేయండి. దీనితో మొహం, మెడ, చేతులు బాగా రుద్దుకోండి. పది నిమిషాలు ఆరి గోరువెచ్చని నీటితో స్నానం చేయండి. శరీరం మృదువుగాను, కాంతివంతంగాను తయారవుతుంది.
 
5. పేస్ట్‌ట్యూబ్ ఖాళీ అవగానే, అందులోకి నోటితో గాలి ఊది సగం వరకు నీరు పోయండి. ఆ నీటిని రాత్రి పడుకునే ముందు మౌత్‌వాష్‌గా ఉపయోగించవచ్చును.
 
6. ఉల్లిపాయ తొక్కల్ని నీటిలో వేడిచేసి ఆ నీరు తలకి రాసుకుంటే మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు