బట్టలపై గోరింటాకు మరకలు పడితే...?

బుధవారం, 30 జనవరి 2019 (11:54 IST)
ఎవరికైనా నచ్చిన బట్టలు వేసుకోవాలంటే చాలా ఇష్టం. కానీ ఒక్కోసారి మనకు తెలియకుండా బట్టలపై ఏవో తెలియని మరకలు దుస్తులను పాడుచేస్తుంటాయి. ఈ మరకలు కారణంగా మళ్లీ ఆ బట్టలు వేసుకోవడానికి వీలుకాదని బాధపడుతుంటారు. ఇలా చిన్నచిన్న విషయానికే బాధపడకుండా.. ఈ చిట్కాలు పాటించి చూడండి.. తప్పక ఫలితం కనిపిస్తుంది. మరి అవేంటో చూద్దాం.
 
1. చిన్న పిల్లల బట్టలు ఉతికేటప్పుడు ఓ బకెట్ నీళ్ళకు నాలుగు చెంచాల అమ్మోనియం కలిపి బట్టలు నానబెట్టి ఉతికితే మరకలు పోవడమే కాకుండా వాసన ఉండదు. 
 
2. బట్టలపై గోరింటాకు మరకలు పడితే మరకలున్న ప్రాంతాల్లో పాలతో రుద్ది అరగంట తరువాత సబ్బుతో ఉతికితే సరిపోతుంది. కోరా రంగు చీరలకు ఆరంగు నిలవాలంటే గంజి పెట్టేటప్పుడు అరకప్పు టీ డికాషన్ కలిపి ఎక్కువసార్లు ముంచి తీయాలి.
 
3. బట్టల మీద సిరా మరకలయితే కొద్దిగా అన్నం వేసి రుద్దాలి. బ్లీచింగ్ పౌడర్‌ను నీళ్ళల్లో కలిగి ఆ ద్రవాన్ని మరకల మీద వేయాలి. ద్రవం ఎండిపోక ముందే నీళ్ళతో శుభ్రం చేసి ఆరబెట్టాలి. బాల్ సాయంటి పెన్ మరకలు పోవడానికి టూట్‌పేస్ట్ కానీ, నిమ్మరసం కానీ మరకల మీద వేసి బాగా రుద్దాలి.
 
4. తాంబూలపు మరకలు బట్టలపై పడితే మరకలున్న చోట నిమ్మరసంతో గానీ, పెరుగుతో గానీ రుద్ది నీళ్ళతో శుభ్రంగా కడగాలి. డొమెస్టిక్ అమ్మోనియాని నీళ్ళలో కలిపి దానికి కొద్దిగా వేడినీళ్ళు పోసి బట్టను బాగా నానబెట్టి ఉతికితే చెమట మరకలు పోతాయి.
 
5. నూనె, గ్రీజ్, చూయింగ్ గమ్ మరకల్ని పోగొట్టాలంటే.. మరకలున్న గుడ్డల మీద గానీ, తివాచీల మీదగానీ యూకలిప్టస్ ద్రవపు చుక్కల్ని వేసి మరకలపై రుద్దండి. తరువాత నీటితో క్లీన్ చేయండి. మరకలు మటుమాయమవుతాయి.
 
6. బట్టల మీద నూనె మరకయితే దానీ మీద గోధమ పిండి గానీ, ఫేస్ పౌడర్ గానీ వేసి ఉంచండి. వాష్ చేసినా, చేయకపోయినా మరక కనపడదు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు