నీలి రంగు శంఖు పువ్వు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. బ్రెయిన్‌కు టానిక్‌గా పనిచేస్తుంది. మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. మెదడును చురుకుగా వుంచుతుంది. యాంటీ ఆక్సిటీని, నరాల బలహీనతను దూరం చేసుకోవాలంటే నీలి శంఖు పుష్పాలతో తయారు చేసే టీని సేవించడం మంచిది.
శ్వాసకోశ రుగ్మతలను నియంత్రిస్తుంది. దగ్గు, జలుబు, ఆస్తమా వంటివాటిని నిరోధిస్తుంది. నీలి రంగు శంఖు పువ్వు మహిళల ఆరోగ్యానికి సహాయపడుతుంది. రుతుక్రమ రుగ్మతలు క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది. గర్భాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే గుణం ఇందులో ఉంది. జీర్ణక్రియకు మేలు చేస్తుంది. వాపును తగ్గించే లక్షణాలు ఈ పువ్వులో పుష్కలంగా వున్నాయి.