సుప్తమత్స్యేంద్రాసనంతో వెన్ను నొప్పి పోవాలంటే...

మంగళవారం, 8 ఆగస్టు 2023 (10:17 IST)
ఎక్కువ సమయంపాటు కూర్చునే ఉండడం, కూర్చునే భంగిమలో పొరపాట్లు, వెన్నుముందుకు వంచి కూర్చోవడం మొదలైన అలవాట్ల వల్ల వెన్నుముకలోని వెన్నునొప్పి వస్తుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే సుప్తమత్స్యేంద్రాసనం సాధన చేయాలి. 
 
వెల్లకిలా పడుకుని చేతులు నేల మీద చాపి ఉంచాలి.
 
కుడి కాలును మడిచి, ఎడమ కాలి మీదుగా శరీరం పక్కకు వంచి, నేలను తాకించాలి.
 
నేలను తాకిన కుడి కాలును ఎడమ చేత్తో పట్టుకోవాలి.
 
చేస్తున్నప్పుడు నడుము కింది భాగం మాత్రమే కదలాలి. అంతేగానీ శరీరం మొత్తం కాలుతోపాటు కదపకూడదు.
 
ఈ భంగిమలో అరగంటపాటు ఉండి రెండోవైపు సాధన చేయాలి.
 
ఆసనం పూర్తయిన తర్వాత కాళ్లు రెండు నేలకు ఆనించి పడుకుని, నెమ్మదిగా పైకి లేవాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు