వెన్నెముకను వంచే అర్ధ మత్స్యేంద్రాసనం

అర్థ మత్స్యేంద్రాసనంలో వెన్నెముకను సగభాగానికి మీరు వంచాల్సి ఉంటుంది. భారతీయ యోగ శిక్షకుల్లో ప్రసిద్ధులైన హఠయోగ మత్స్యేంద్రనాథ పేరిట ఈ అర్ధ మత్స్యేంద్రాసనం ఉనికిలోకి వచ్చింది. సంస్కృతంలో 'అర్ధ' అంటే సగం అని అర్థం. వెన్నెముకను పూర్తిగా వంచడం చాలా కఠినతరమైన భంగిమ కావడంతో యోగాభ్యాసకులు అర్ధ మత్స్యేంద్రాసనాన్ని మాత్రమే ఎక్కువగా అభ్యసిస్తుంటారు.

ఉత్తమమైన మెలి తిప్పే భంగిమలలో అర్ధ మత్స్యేంద్రాసనం ఒకటి. ఈ ఆసనంలో వెన్నెముక మొత్తంగా దాని అక్షం చుట్టూ తిరుగుతుంది. పైగా ఈ పద్ధతిలో వెన్నెముకను రెండుసార్లు కుడిఎడమలకు మెలితిప్పవచ్చు.
ఇలా వెన్నెముకను పూర్తిగా మెలితిప్పేందుకు గాను మన చేతులు, మోకాళ్లే సాధనాలుగా ఉపకరిస్తాయి

ఆసనం వేయు పద్ధతి
పద్మాసన స్థితికి రావాలి.
స్థిరంగా కూర్చోవాలి.
కాళ్లు వెలుపలకు చాచిన విధంగా ఉండాలి.
ఒక పాదాన్ని మీ పిరుదుల కిందకు తేవాలి.
కుడి తొడను నేరుగా ఉంచాలి.
ఇప్పుడు మీ ఎడమ కాలిని నేలమీద ఆనించాలి.
కుడి మోకాలును వంచాలి.
మీ ఎడమ మోకాలును మీ కుడి మోకాలు యొక్క కుడివైపున దగ్గరగా ఆనేలా ఉంచాలి.
మీ కుడి చేతిని మీ ఎడమ మోకాలి ఎడమ వైపు పైభాగానికి ఆనేలా ఉంచాలి.
కుడిచేతిని ఎడమ పిక్క మీద ఉండేలా చాచి ఉంచాలి.
మీ కుడి బొటనవేలు, చూపుడు వేలు, మధ్యవేలుతో ఎడమ కాలివేలును పట్టి ఉంచాలి.
మీ ఎడమ చేతిని మీ తుంటి కింది భాగం పొడవునా సాచి కుడి తొడ మూల భాగాన్ని పట్టి ఉంచండి
మీ మొండేన్ని ఎడమవైపుకు మెల్లగా తిప్పాలి.
ఏకకాలంలో మీ భుజాలు, మెడ మరియు తలను ఎడమవైపుకు తిప్పాలి.
గడ్డాన్ని మీ ఎడమ భుజం వద్దకు తిప్పాలి.
మీ వెనకవైపుకు చూస్తూ ఉండాలి.
మీ తలను, వెన్నెముకను స్థిరంగా ఉంచాలి.
మీకు సౌకర్యంగా ఉంది అనిపించేంతవరకు ఈ స్థితిలో కూర్చోవాలి.
మెల్లగా ప్రారంభ స్థితికి తిరిగి రావాలి.
ఈ ఆసనాన్ని కుడివైపున కూడా చేయండి.

WD
ప్రయోజనాలు -
ఈ ఆసనం వేయడం ద్వారా వెన్నెముక ప్రత్యేకించి కటిసంబంధ వెన్నుపూస అతి సులువుగా కదులుతుంది.
వెన్నెముక మెలి తిప్పబడుతుంది కాబట్టి ఇది సాధ్యపడుతుంది. దీంతో కదలగలిగిన ప్రతి వెన్నుపూస తన పరిధిలో సులువుగా తిరుగుతుంది.

జాగ్రత్తలు-
మీరు పొట్ట మరియు వెన్నెముకకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్నట్లయితే, ఈ ఆసనాన్ని వేయరాదు.

వెబ్దునియా పై చదవండి