06-09-2020 ఆదివారం మీ రాశి ఫలితాలు.. ఇష్టదైవాన్ని పూజించి..?

ఆదివారం, 6 సెప్టెంబరు 2020 (05:00 IST)
ఇష్టదైవాన్ని పూజించి, ఆరాధించడం వల్ల సర్వదా శుభం, జయం కలుగుతుంది. 
 
మేషం: బంధుమిత్రుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. పత్రిక, ప్రైవేట్ సంస్థల్లోని వారికి ఆశించిన మార్పులు వాయిదా పడుతాయి. ఖర్చులు అధికం. ప్రేమికుల తొందపాటు నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి. రుణయత్నాలలో అనుకూలత, రావలసిన ధనం అందటం వంటి శుభపరిణామాలుంటాయి. 
 
వృషభం: క్రీడా, కళా, సాంస్కృతిక రంగాల పట్ల ఆసక్తి వహిస్తారు. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలకు గుర్తింపు లభిస్తుంది. కొంతమంది. మీ ఆలోచనలను తప్పుదారి పట్టించేందుకు ఆస్కారం వుంది. ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. స్త్రీలు ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు మెలకువ వహించండి. 
 
మిథునం: హోటల్, కేటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. నూతన పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించండి. చేపట్టిన పనులు కొంత ముందు వెనుకాలుగానైనా పూర్తి చేస్తారు. ఆప్తుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రముఖుల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. 
 
కర్కాటకం: ఏదైనా స్థిరాస్తి అమ్మకం చేయాలనే మీ ఆలోచన మరికొంత కాలం వాయిదా వేయడం మంచిది. నూతన కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఖర్చులు అధికం. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. స్త్రీలకు పనివారితో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వృత్తి, వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. 
 
సింహం: రుణం కొంత మొత్తం తీర్చడంలో ఒత్తిడి నుంచి కుదుటపడతారు. మీ మాటలు ఇతరులకు జారవేసే వ్యక్తులున్నారని గమనించండి. ప్రయాణాలు వాయిదాపడతాయి. మీ కుటుంబీకులు మీ మాటా తీరును వ్యతిరేకిస్తారు. అనుకున్న పనులు ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. 
 
కన్య: కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. వ్యాపారాభివృద్ధికి చేసే ప్రయత్నాల్లో సఫలీకృతులౌతారు. విద్యార్థుల ఆలోచనలు పక్కదారిపట్టవచ్చు. బంధువులను కలుసుకుంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తారు. 
 
తుల: ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. ధనం ఏమాత్రం నిల్వ చేయలేకపోవడం వల్ల ఆందోళనకు గురవుతారు. రాజకీయ నాయకులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. దైవ సేవా కార్యక్రమాలకు ధనం బాగా వ్యయం చేస్తారు. స్త్రీలకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. 
 
వృశ్చికం: నిత్యావసర వస్తు వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు ఆశాజనకం. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. కష్ట సమయంలో సన్నిహితులకు అండగా నిలుస్తారు. అందరితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆత్మీయులు దూరమవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది.
 
ధనస్సు: గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలించగలవు. విద్యార్థులకు కొన్ని నిర్భంధాలకు లోనవుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. ఖర్చులు పెరిగినా ఇబ్బందులుండవు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో లౌక్యం అవసరం. సహోద్యోగులతో అభిప్రాయ బేధాలు తలెత్తుతాయి.
 
మకరం: తలపెట్టిన పనులు అనుకున్న విధంగా సాగకుండా విసుగు కలిగిస్తాయి. దూర ప్రయాణాల్లో వస్తువుల పట్ల మెళకువ అవసరం. మీ అభిప్రాయాన్ని కచ్చితంగా తెలియజేయడం మంచిది. దంపతుల మధ్య అవగాహన లోపం, పట్టింపులు అధికం. స్త్రీలకు అయిన వారి నుంచి ఆదరణ, సహాయం లభిస్తాయి.
 
కుంభం: కొన్ని అనుకోని సంఘటనలు మనస్తాపం కలిగిస్తాయి. మీ తొందరపాటు తనం వల్ల వ్యవహారం బెడసికొట్టే ఆస్కారం వుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఆశాజనకం. వృత్తిపరంగా ప్రముఖులను కలుసుకుంటారు. సోదరీ సోదరుల తీరు ఆందోళన కలిగిస్తుంది. వాగ్వివాదాలకు సరైన సమయం కాదని గమనించండి. 
 
మీనం: దైవ దర్శనాల్లో పాల్గొంటారు. పాత పరిచయస్తులు, ఆప్తులను కలుసుకుంటారు. ఖర్చులు మీ అంచనాలకు విరుద్ధంగా ఉంటాయి. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. ప్రముఖులతో ఇంటర్వ్యూలు అనుకూలించి మీ పనులు సానుకూలమవుతాయి. వాయిదా పడిన పనులు ఎట్టకేలకు పూర్తి చేస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు