ప్రణాళికలు వేసుకుంటారు. పనులు ఒక పట్టాన సాగవు. సన్నిహితులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సోదరులను సంప్రదిస్తారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు.
పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రతికూలతలను అనుకూలంగా మలుచుకుంటారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. దూరపు బంధువులతో సంభాషిస్తారు. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. శుభకార్యానికి హాజరవుతారు.
వ్యవహారాలతో తీరిక ఉండదు. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. ఒత్తిడికి గురికావద్దు. స్థిమితంగా ఉంటానికి యత్నించండి. పనులు మందకొడిగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. వాహనం మరమ్మతుకు గురవుతుంది.
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
రావలసిన ధనం అందుతుంది. ఆర్భాటాలకు ఖర్చు చేస్తారు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. మీ సాయంతో ఒకరికి మేలు జరుగుతుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివస్తుంది. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి.
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. ఉత్సాహంగా యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి.
ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. ఖర్చులు సామాన్యం. పనులు వేగవంతమవుతాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. గృహమార్పునకు యత్నాలు సాగిస్తారు.
సమర్ధతను చాటుకుంటారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. ఉన్నతిని చాటుకోవటానికి ఖర్చు చేస్తారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. చేపట్టిన పనులు అర్ధాంతంగా ముగిస్తారు. కీలక పత్రాలు అందుకుంటారు.
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహారానుకూలత, ధనప్రాప్తి ఉన్నాయి. విజ్ఞతతో వ్యవహరిస్తారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. వేడుకను ఆర్భాటంగా చేస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. పిల్లల అత్యుత్సాహం అదుపు చేయండి. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది.
పరిస్థితులు అనుకూలిస్తాయి. ధైర్యంగా ముందుకు సాగుతారు. యత్నాలకు ఆప్తుల ప్రోత్సాహం ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుంటారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ముందుచూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితమిస్తుంది. ముఖ్యమైన పత్రాలు అందుతాయి.
ఊహించని ఖర్చు ఆందోళన కలిగిస్తుంది. చెల్లింపుల్లో అలక్ష్యం తగదు. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ ఆప్తులతో సంభాషణ ఉత్సాహాన్నిస్తుంది. పత్రాలు, ఆహ్వానం అందుకుంటారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. పత్రాల రెన్యువల్లో ఏకాగ్రత వహించండి. వేడుకకు హాజరవుతారు. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి.
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
రోజువారీ ఖర్చులే ఉంటాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మీయులతో సంభాషిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. నోటీసులు అందుకుంటారు. ఒక ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. ముఖ్యుల కలయిక వీలుపడదు.