ఆర్థికస్థితి నిరాశాజనకం. ఖర్చులు అంచనాలను మించుతాయి. నిస్తేజానికి లోనవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. సన్నిహితుల కలయిక వీలుపడదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఆది, సోమవారాల్లో పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. త్వరలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. ఒక సమాచారం ఉల్లాసానిస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు. సంతానం కదలికలపై దృష్టి పెట్టండి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ప్రధానం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపుల స్థల మార్పు అనివార్యం.
పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం. అపజయాలకు కుంగిపోవద్దు. కొంతమంది వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సంయమనంతో మెలగండి. ఖర్చులు విపరీతం. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. మంగళవారం నాడు అప్రియమైన వార్తలు వినవలసి వస్తుంది. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. సంతానం విజయం ఉపశమనం కలిగిస్తుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. అధికారులకు ధనప్రలోభం తగదు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు తరుణం కాదు. పుణ్యకార్యక్రమంలో పాల్గొంటారు.
అన్ని విధాలా అనుకూలమే. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. బుధ, గురువారాల్లో ఫోన్ సందేశాలను నమ్మవద్దు. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. సంతానం దూకుడు అదుపు చేయండి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. దాంపత్య సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. న్యాయ, వైద్య, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు.
ప్రతికూలతలను ధీటుగా ఎదుర్కుంటారు. మీ సమర్థతపై ఎదుటివారికి గురికుదురుతుంది. వ్యవహారాలు మీ ఆధ్వర్యంలో సాగుతాయి. మీ ప్రతిపాదనలు ఉభయులకూ ఆమోదయోగ్యమవుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు. శనివారం నాడు పనులు ఒక పట్టాన పూర్తి కావు. సంతానం ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆహ్వానం అందుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అధికారులకు హోదామార్పు, ఉపాధ్యాయులకు స్థానచలనం. వ్యాపారాల్లో ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. మీ పథకాలు, ప్రణాళికలు ఆశించిన ఫలితాలిస్తాయి. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. రిప్రజెంటేటివ్‌లకు ఒత్తిడి అధికం. ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది.
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము
కార్యం సిద్ధిస్తుంది. పురస్కారాలు, ప్రశంసలు అందుకుంటారు. అవకాశాలు కలిసివస్తాయి. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ఆదివారం నాడు బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు ఒక పట్టాన పూర్తి కావు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. భేషజాలకు పోవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. ఆహ్వానం అందుకుంటారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగులకు కొత్త సమస్యలెదురవుతాయి. నిరుద్యోగులకు శుభయోగం. ఉపాధ్యాయులకు పదోన్నతి. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు.
ప్రతికూలతలతో సతమతమవుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. మీ సమస్యలను సన్నిహితులకు తెలియజేయండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఖర్చులు విపరీతం. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. సోమ, మంగళవారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. అంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. గృహమార్పు ఫలితం త్వరలో కనిపిస్తుంది. కీలక పత్రాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఉన్నతాధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వైద్య, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వేడుకకు హాజరవుతారు.
లక్ష్యాన్ని సాధిస్తారు. అందరితో సత్సబంధాలు నెలకొంటాయి. ఆదాయం బాగుంటుంది. విలాసవస్తువులు కొనుగోలు చేస్తారు. రశీదులు జాగ్రత్త. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులను ఆశ్రయించవద్దు. బుధవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. మీ నుంచి విషయసేకరణకు కొంతమంది యత్నిస్తారు. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. సంతానం విజయం సంతోషాన్నిస్తుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. నిరుద్యోగులకు శుభయోగం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సంస్థల స్థాపనలకు అనుకూలం. ద్విచక్ర వాహనదారులకు అత్యుత్సాహం తగదు.
వృశ్చికం : విశాఖ 4వ పాదము, అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహార దక్షతతో నెట్టుకొస్తారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. వ్యతిరేకులు చేరువవుతారు, వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. ధనలాభం, వాహనయోగం ఉన్నాయి. ఖర్చులు విపరీతం. గురువారం నాడు ఊహించని సంఘటనలెదురవుతాయి. పనులు, కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. మీపై శకునాల ప్రభావం అధికం. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. ఆశావహదృక్పథంతో మెలగండి. సన్నిహితులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పును గమనిస్తారు. సంతానం విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. వ్యాపాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. షాపు పనివారలతో జాగ్రత్త. న్యాయ, వైద్య రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ఉద్యోగస్తులకు పదవీయోగం, స్థానచలనం. రిటైర్డు అధికారులకు ఆత్మీయ వీడ్యోలు పలుకుతారు.
సంకల్ప బలంతోనే లక్ష్యాన్ని సాధిస్తారు. చిత్తశుద్ధితో యత్నాలు సాగించండి. సహాయం ఆశించవద్దు. దూరపు బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఆదాయం బాగుంటుంది. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. శనివారం నాడు పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. ప్రముఖుల సందర్శనం అనుకూలించినా ఫలితం ఉండదు. ఆలోచనల్లో మార్పు వస్తుంది. మొండి ధైర్యంతో అడుగు ముందుకేస్తారు. సంతానం విషయంలో శుభం జరుగుతుంది. పత్రాల రెన్యువల్లో మెలకువ వహించండి. గృహోపకరణాలు, వాహనం మరమ్మతుకు గురవుతాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను అధిగమిస్తారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. ఉద్యోగుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. పురస్కారాలు అందుకుంటారు. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి. దూర ప్రయాణం తలపెడతారు.
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. ఆప్తులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. సోమ, మంగళవారాల్లో ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆరోగ్యం సంతృప్తికరం. సంతానం ఉన్నత చదువుల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. ఉపాధి పథకాలు చేపడతారు. ఉపాధ్యాయులకు కోరుకున్న చోటికి బదిలీ అవుతుంది. నూతన వ్యాపారాలకు తగిన సమయం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు.
కొత్త సమస్యలెదురయ్యే సూచనలున్నాయి. పంతాలకు పోవద్దు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. ఆదాయం బాగుంటుంది. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. పెట్టుబడులకు తరుణం కాదు. సంతానం మొండితనం ఇబ్బంది కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెంపొందుతుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. హోల్‌సేల్ వ్యాపారులు, స్టాకిస్తులకు పురోభివృద్ధి. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. అధికారులకు ధనప్రలోభం తగదు. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతి లోపం. అసాంఘిక కార్యకలాపాల జోలికిపోవద్దు.
ఈ వారం అన్ని విధాలా ఆశాజనకం. వివాహయత్నం ఫలిస్తుంది. కల్యాణ వేదికలు అన్వేషిస్తారు. పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. పాత పరిచయస్తులు తారసపడతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సోదరీ సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. సంతానం కదలికలపై దృష్టి సారించండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వైద్య, సేవ, కంప్యూటర్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం.