తాజా పచ్చి వెల్లుల్లి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే నల్ల వెల్లుల్లి గుండెను కాపాడుతుంది. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
తెల్ల వెల్లుల్లిని సరైన ఉష్ణోగ్రత, తేమలో ఉంచడం ద్వారా నలుపు వెల్లుల్లిని తయారు చేస్తారు. నల్ల వెల్లుల్లిలో ఐరన్, విటమిన్ బి, సి, కె, సెలీనియం, కాల్షియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇందులోని ప్రత్యేకమైన యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి.