జీలకర్ర ఎసిడిటిని తగ్గిస్తుంది. సాధారణంగా భోజనం తర్వాత మన దేశంలో చాలామంది జీలకర్రను ఎంతో కొంత మొత్తంలో నోటిలో వేసుకొని చప్పరించటం చూస్తూ వుంటాం. తిన్న పదార్ధాలకు జీర్ణక్రియ బాగా జరగాలంటే, అజీర్ణం వంటివి ఏర్పడకుండా వుండాలంటే, ఈ జీలకర్ర తినటం ఎంతో మేలు చేస్తుంది. పొట్టనొప్పి, అజీర్ణం, డయోరియా, వాంతి వికారం, మార్నింగ్ సిక్ నెస్ వంటి అనారోగ్యాలకు జీలకర్రను బాగా వేయించి కొద్దిగా ఉప్పు కలిపి తినటం చేస్తారు.