నెలసరి సమయంలో మహిళలు కాళ్లు లాగడం, నడుం వంటి సమస్యలతో బాధపడుతుంటారు. నీరసంగా ఉంటారు. ఇలాంటి సమయంలో గోంగూర తినడం వల్ల వారి శరీరానికి శక్తి లభిస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచడంలో, విరిగిన ఎముకలు త్వరగా అతుకునేలా చేయడంలో గోంగూర ఉపయోగపడుతుంది.
గోంగూరలో మెగ్నీషియం, ఫాస్పరస్, కాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారుస్తుంది. అందుకే 30 దాటిన మహిళలలు గోంగూరను ఆహారంలో భాగం చేసుకోవాలి.
వారంలో మూడు, నాలుగు సార్లు తీసుకుంటే.. హైబీపిని పూర్తిగా కంట్రోల్ చేస్తుంది. దగ్గు, ఆయాసం, తుమ్ములతో బాధపడేవారికి గోంగూర ఉపశమనం కలిగిస్తుంది.