చీకట్లో ఉండొచ్చు
నాసా తన వెబ్ సైట్లో పేర్కొన్న కథనం ప్రకారం... సెప్టెంబర్ 7న చంద్రయాన్ 2 ల్యాండర్ చంద్రుడి మీద హార్డ్ ల్యాండ్ అయ్యింది. అంటే అది చంద్రుడి ఉపరితలాన్ని నేరుగా ఢీకొట్టింది. ఈ ప్రాంతంలో సెప్టెంబర్ 17న తమ లూనార్ రికన్సిలేషన్ ఆర్బిటర్ కెమెరా 150 కిలోమీటర్ల ఎత్తులో ఎగురుతూ తీసిన ఫోటోలను ఇప్పుడు విడుదల చేసింది. అయితే తమ బృందాలు విక్రమ్ ల్యాండర్‌ను కానీ, అది కూలిన ప్రదేశాన్ని కూడా గుర్తించలేకపోయాయని తెలిపింది.