* కుంకుమపువ్వు-గంధం ఫేస్ ప్యాక్ తయారీకి కావాల్సిన పదార్థాలేంటంటే.. కుంకుమపువ్వు కాస్తంత, గంధంపొడి ఒక టీస్పూన్, పాలు రెండు టీస్పూన్లు. ఒక చిన్న బౌల్, కలిపేందుకు ఒక చెమ్చా.
* కుంకుమపువ్వు, గంధం పొడిని పాలలో కలిపి బాగా రంగరించాలి. ముఖాన్ని శుభ్రం చేసుకున్న తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించి, ఓ 20 నిమిషాలపాటు అలాగే ఉంచి, ఆ తరువాత పరిశుభ్రమైన నీటితో కడిగేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా వారానికి రెండు లేదా మూడుసార్లు చేసినట్లయితే ముఖ సౌందర్యం ఇనుమడిస్తుంది.