ముల్తానీ మట్టి పుదీనా ఫేస్ ప్యాక్

ముల్తానీ మట్టి పుదీనా ప్యాక్ రక్త ప్రసరణను మెరుగుపరచి చర్మాన్ని మెరిపిస్తుంది. చర్మంపై ఉండే మృత కణాలను తొలగిస్తుంది. దీన్ని తయారు చేయడం ఎలాగంటే... ఒక టీస్పూన్ పెరుగు, ఒక టీస్పూన్ ముల్తానీ మట్టి, ఒక టీస్పూన్ పుదీనా పొడి తీసుకుని అన్నింటినీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసుకుని 15 నిమిషాల తరువాత గోరువెచ్చటి నీతితో కడిగి, వెంటనే చన్నీళ్లతో కడిగేయాలి. జిడ్డు చర్మం కలిగిన వారికి ఇది చాలా మంచి ప్యాక్. అయితే పొడి చర్మం కలవారు ఈ ప్యాక్ వేసుకోకూడదు. పొడిచర్మంవారు కూడా దీన్ని ఉపయోగించాలనుకుంటే... నీటికి బదులుగా, రోజ్ వాటర్‌ను ఉపయోగించాలి. ముఖానికి ప్యాక్ వేసుకుని 2, 3 నిమిషాలకంటే ఎక్కువసేపు ఉంచుకోకూడదు. తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. అలాగే, మొటిమలతో బాధపడేవారు... మూడు వేపాకులను మెత్తగా నూరి, దాంట్లో ఒక టీస్పూన్ ముల్తానీ మట్టిని కలుపుకోవాలి. ముఖాన్ని శుభ్రం చేసుకుని ఈ మిశ్రమాన్ని ప్యాక్ లాగా వేసుకుని 15 నిమిషాల తరువాత మంచినీటితో కడిగేయాలి. అంతే ఇలా క్రమం తప్పకుండా చేస్తే, మీ ముఖం అద్దంలాగా మెరిసిపోతుందంటే నమ్మండి.

వెబ్దునియా పై చదవండి