"రౌడీ బాయ్స్ ఫేమ్ ఆశిష్ హీరోగా నటించనున్న చిత్రానికి దేత్తడి టైటిల్ ఖరారు చేశారు. నూతన దర్శకుడైన ఆదిత్య రావు గంగసాని తన క్రియేటివ్ విజన్‌ను తెరపైకి తీసుకురానున్నారు. ఈ చిత్రం హైదరాబాద్ వీధుల్లో చోటుచేసుకునే కల్చర్ తో నిండిన, భావోద్వేగంతో కూడిన అనుభూతిని ప్రేక్షకులకు అందించనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు , శిరీష్ తమ బేనర్ లో రూపొందిస్తున్న 60వ సినిమా ఇది. ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది