పౌడర్‌ను ఎలా ఎంచుకోవాలో తెలుసా?

సోమవారం, 30 జూన్ 2014 (17:27 IST)
సరైన మేకప్ లేకపోతే.. మహిళలు ఎంత అందంగా ఉన్నా.. పేలవంగా, నిర్జీవంగా కనిపిస్తారు. నగరాల్లో నివసించేవారు క్రీములు, మాయిశ్చరైజ్‌లు, స్కిన్‌లోషన్లు, పౌడర్లు వాడితే.. మారుమూల గ్రామల మహిళలు కనీసం పౌడర్‌నైనా వాడుతున్నారు. చర్మతత్వాన్ని బట్టి పౌడర్‌ వాడకం ఉండాలి.
 
పౌడర్‌ను ఎలా ఎంచుకోవాలంటే.. పౌడర్‌ను మీ చర్మ రంగును బట్టి సెలక్ట్ చేసుకోవాలి. పౌండేషన్ అప్లయ్ తేశాక ముఖానికి పౌడర్ అద్దాలి. ఈ పౌడర్ యూనిఫాంగా వుండాలి. ఫౌడర్‌ని అతిగా అప్లయ్ చేయడం మంచిది కాదు. ఎక్సెస్ ఫౌడర్‌ని రిమూవ్ చేసుకోవాలంటే పఫ్‌తో నెమ్మదిగా తుడిచి వేయాలి. తర్వాత సున్నితంగా ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి. 
 
పొడిచర్మంవారు, చర్మం మడతలు పడినవారు క్రీమ్ పౌడర్ను ఉపయోగించాలి. దీనివల్ల చర్మం మృదువుగా తయారవుతుంది మీది జిడ్డుచర్మమైతే మాయిశ్ఛరైజింగ్ ఎపెక్ట్స్ ఇచ్చే ఫేస్ పౌడర్ కొనుక్కోవాలి.
 
టీనేజ్ అమ్మాయిలు షమ్మర్ పౌడర్ అప్లై చేసుకుంటే వారిలో అందం మాత్రమే కాదు ముఖానికి చక్కటి మెరుపు వస్తుంది. సాయంత్రం వేళల్లో అందునా పార్టీలకు వెళ్లేటప్పుడు గ్లిట్టర్ పౌడర్ ఉపయోగించాలి. 
 
పౌడర్ రాసుకోవడం ఎలా? 
మాయిశ్చరైజర్ రాసుకున్న తర్వాత పౌడర్ రాసుకుంటే బాగుంటుంది. పౌండేషన్ అప్లై చేసినప్పుడు ముందుగా ఫౌండేషన్ క్రీమ్ ముఖం మీద సరిగ్గా సెట్ అయిందా లేదో చూసుకోవాలి. ఆ తర్వాత ఫౌడర్ రాసుకోవాలి.
 

వెబ్దునియా పై చదవండి