చరిత్ర సృష్టించిన రిలయన్స్ గ్యాస్

ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ చరిత్ర సృష్టించింది. కృష్ణ-గోదావరి బేసిన్ నుండి గ్యాస్ ఉత్పత్తిని బుధవారం నుండి ప్రారంభించింది. సహజ వాయువు కృష్ణ గోదావరి బేసిన్ నుండి మనకు అందుబాటులోకి వచ్చింది. ఈ మహత్కార్యం కేవలం 7 సంవత్సరాలలో పూర్తయ్యింది. దీంతో భారత ఇంధన పరిస్థితిలో గణనీయమైన మార్పు రానుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.

రోజుకు 2.5 మిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి జరుగనుందని పెట్రోలియం సెక్రటరీ ఆర్.ఎస్. పాండే తెలిపారు. రిలయన్స్ గ్యాస్ కారణంగా భారత ఆయిల్ మిల్‌లో సంవత్సరానికి 9 బిలియన్ డాలర్లు మిగులుతుందని ఆయన తెలిపారు.

సహజ వాయువు కోసం బుధవారం సాయంత్రం 5 గంటల నుండి డ్రిల్లింగ్ ప్రారంభమైంది. ఆ గ్యాస్ గురువారం ఉదయానికి కాకినాడ వద్ద నున్న గాడిమొగ గ్యాస్ స్టేషన్‌కు చేరుకుంటుందని కంపెనీ ప్రతినిధి తెలిపారు. కెజి డి6 బావిలోని గ్యాస్ పరిణామం పూర్తయ్యే నాటికి 42 బిలియన్ డాలర్ల గ్యాస్ అమ్మకాలు జరగన్నాయి. ఇందులో ప్రభుత్వాదాయం 14 బిలియన్ డాలర్లుగా ఉంటుందని పాండే వివరించారు.

వెబ్దునియా పై చదవండి