థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

సిహెచ్

సోమవారం, 19 మే 2025 (23:26 IST)
దక్షిణాసియాలోని ప్రముఖ క్యాన్సర్ హాస్పిటల్ నెట్‌వర్క్ అయిన అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ (ఏఓఐ), 61 ఏళ్ల రోగి వట్టివేల ఆదినారాయణకు గుంటూరులోని తమ కేంద్రంలో విజయవంతంగా చికిత్స అందించింది. ఈ  రోగికి థైమోమాతో కూడిన మస్తీనియా గ్రావిస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది, ఇది థైమస్ గ్రంథి(ఛాతీలో, రొమ్ము ఎముక వెనుక, గుండె పైన ఉంది)లోని కణితితో సంబంధం ఉన్న అరుదైన ఆటో ఇమ్యూన్ రుగ్మత. ఈ పరిస్థితికి కీలకమైన సూచికలుగా వాలిపోతున్న కనురెప్పలు, బల్బార్ లక్షణాలు, మింగటంలో ఇబ్బంది వంటి లక్షణాలు అతనికి వున్నాయి.
 
రైట్ వీడియో-అసిస్టెడ్ థొరాకోస్కోపిక్ సర్జరీ(VATS) థైమెక్టమీ అనే మినిమల్లీ ఇన్వాసివ్ సర్జికల్ ప్రక్రియను రోగి చేయించుకున్నాడు, దీనిని గుంటూరులోని ఏఓఐలో సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఫణీంద్ర కుమార్ నాగిసెట్టి నిర్వహించారు. ఈ అధునాతన సాంకేతికత రోగికి కనీస అసౌకర్యంతో థైమోమాను ఖచ్చితంగా తొలగించేలా చేసింది, వేగంగా కోలుకోవడంలోనూ సహాయపడింది.
 
ఈ విజయం గురించి సిటిఎస్ఐ-దక్షిణాసియా సీఈఓ హరీష్ త్రివేది మాట్లాడుతూ, “విజయవంతమైన రీతిలో ఈ సంక్లిష్ట కేసు యొక్క నిర్వహణ, రోగి-కేంద్రీకృత విధానంతో ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణను అందించడంలో మా నిబద్ధతను హైలైట్ చేస్తుంది. ఏఓఐలో, అత్యంత సవాలుతో కూడిన సందర్భాలలో కూడా అత్యుత్తమ ఫలితాలను అందించడానికి మేము అత్యాధునిక సాంకేతికత, మా బహుళ విభాగ బృందాల నైపుణ్యాన్ని ఉపయోగిస్తాము. ఈ విజయం ఏపి ప్రాంతంలో ఆంకాలజీ, సంబంధిత ప్రత్యేకతలకు ప్రముఖ కేంద్రంగా మా స్థానాన్ని మరింత పటిష్టం చేస్తుంది.” అని అన్నారు. 
 
సర్జికల్ బృందానికి నాయకత్వం వహించిన డాక్టర్ ఫణీంద్ర కుమార్ నాగిసెట్టి మాట్లాడుతూ, “థైమోమాతో మస్తీనియా గ్రావిస్ అనేది అరుదైన, సంక్లిష్టమైన పరిస్థితి, దీనికి సత్వర రోగ నిర్ధారణ, ఖచ్చితమైన శస్త్రచికిత్స అవసరం. రైట్ VATS థైమెక్టమీ ద్వారా, రోగి యొక్క సౌకర్యం, కోలుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూ థైమోమాను పూర్తిగా తొలగించాము. ఈ కేసు సరైన ఫలితాలను సాధించడంలో బహుళ విభాగ సహకారం మరియు అధునాతన శస్త్రచికిత్సా పద్ధతుల ప్రాముఖ్యతను వెల్లడిస్తుంది” అని అన్నారు. 
 
ఏఓఐ ఆంధ్రప్రదేశ్ రీజియన్ ఆర్‌సిఓఓ, మహేంద్ర రెడ్డి, అధునాతన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల లభ్యత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, “ఏఓఐలో, ఆంధ్రప్రదేశ్ అంతటా రోగులకు అత్యాధునిక వైద్య సంరక్షణను అందుబాటులోకి తీసుకురావడానికి మేము అంకితభావంతో ఉన్నాము. ఈ కేసు విజయవంతమైన ఫలితం గుంటూరు, పరిసర ప్రాంతాలలోని రోగులకు ప్రపంచ స్థాయి నైపుణ్యం, వినూత్న చికిత్సలను దగ్గరగా తీసుకురావడానికి మా ప్రయత్నాలను ప్రతిబింబిస్తుంది” అని అన్నారు.
 
ఏఓఐ వైద్య బృందం పర్యవేక్షణలో రోగి బాగా కోలుకుంటున్నారు. శస్త్రచికిత్స తర్వాత అతని ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడిండి. అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్, గుంటూరు, రోగులకు అధునాతన, ప్రేమ పూర్వక సంరక్షణను అందించడంలో ముందంజలో ఉంది, ఆరోగ్య సంరక్షణలో శ్రేష్ఠత ద్వారా జీవితాలను మెరుగుపరచడానికి దాని నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు