రికార్డు స్థాయిలో ప్రపంచ వాణిజ్య వృద్ధి రేటు: డబ్ల్యూటీఓ
ఈ ఏడాది ప్రపంచ వాణిజ్య వృద్ధి (వరల్డ్ ట్రేడ్ గ్రోత్) రేటు రికార్డు స్థాయిలో నమోదైనట్లు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) ప్రకటించింది. గతంలో 10శాతానికి పడిపోయిన ఈ వృద్ధి రేటు 13.5శాతానికి పెరినట్లు డబ్ల్యూటీఓ తెలిపింది.
2010 సంవత్సరంలో ఇప్పటి వరకూ ప్రపంచ వాణిజ్యం ఆశించినదాని కన్నా వేగంగా వృద్ధి చెందిందని, ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ ప్రపంచ వాణిజ్య పెరుగుదల 13.5శాతంగా ఉన్నట్లు డబ్ల్యూటీఓ ఆర్థిక వేత్తలు సూచించారు.
గత 2009లో 12.2శాతంగా ఉన్న వృద్ధి రేటు చాలా వేగంగా వృద్ధి చెంది గడచిన 60 ఏళ్లుగా ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో నమోదైనట్లు డబ్ల్యూటీఓ తెలిపింది.