మియామి ఎఫ్1 వీకెండ్ ఈసారి ఒక దేశీ ట్విస్ట్ తో మరింత సంచలనం రేపింది. ఇండియన్ యాక్టర్, ఎంటర్‌ప్రెన్యూర్ రానా దగ్గుబాటి, తన లోకా లోకా టకీలా టీంతో కలిసి నగరంలోని అత్యంత ఎక్స్‌క్లూజివ్ పార్టీల్లో సందడి చేస్తూ కనిపించారు. హాలీవుడ్ గ్లామర్, హిప్‌హాప్ స్టార్‌లు, ఇండియన్ స్టైల్ లో ఈ వేడుకలో 50 సెంట్స్, ఫ్లో రిడా, ఆస్కార్ విజేత క్యూబా గూడింగ్ జూనియర్‌లు రానా, అతని టీంతో కలిసి సందడి చేశారు. ఈ జోష్ మియామి నగరమంతా చర్చగా మారింది.