తప్పుడు ఆధార్ నంబరిస్తే రూ.10 వేల అపరాధం

ఆదివారం, 14 జులై 2019 (12:36 IST)
తప్పుడు ఆధారిస్తే ఇకపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. తప్పుడు ఆధార్ ఇస్తే రూ.10 వేల అపరాధం విధించనున్నారు. పాన్ కార్డు అవసరమైన చోట ఆధార్ సంఖ్యను వాడుకోవచ్చు. కానీ, తప్పుడు ఆధార్ ఇస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోనున్నారు. 
 
తప్పుడు ఆధార్‌ను నమోదు చేస్తే రూ.10 వేల జరిమానా విధించేలా సంబంధిత చట్టాల్లో మార్పులు తేవాలని భావిస్తోంది. సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి జరిమానా నిబంధన అమలు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ అభిమతంగా ఉంది. 
 
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్, తన బడ్జెట్ ప్రతిపాదనల సందర్భంగా పాన్ కార్డ్ తప్పనిసరి కాదని, దాని స్థానంలో ఆధార్‌ నంబరను కూడా వినియోగించుకోవచ్చని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 
 
ప్రస్తుతం దేశంలో 40 కోట్ పాన్ కార్డులు ఉండగా, 22 కోట్ల మంది పాన్ కార్డులకు మాత్రమే ఆధార్ నంబరుతో జతచేయడం జరిగింది. 120 కోట్ల మందికి ఆధార్ కార్డులు ఉన్నాయి. ఈ కారణంతోనే పాన్‌కు ప్రత్యామ్నాయంగా ఆధార్‌ను విస్తృతంగా ప్రమోట్ చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం భావిస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు