దీనికి కారణం లేకపోలేదు. నానాటికీ పెరిగిపోతున్న ఖర్చులను, ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఆ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా, పనితీరు సరిగ్గా లేదని భావిస్తున్న ఉద్యోగులను నిర్బంధ సెలవుపై ఐదేళ్ల వరకూ పంపాలని భావిస్తోంది.
ఉద్యోగుల సూటబిలిటీ, ఎఫిషియన్సీ, కాంపిటెన్సీ, క్వాలిటీ, పెర్ఫార్మెన్స్, హెల్త్ తదితరాలతో పాటు ఇటీవలి కాలంలో పెట్టిన సెలవులు తదితరాలను మదించి ఎవరిని సెలవులపై పంపించాలన్న విషయమై సిఫార్సులు చేస్తారని ఏఐ అధికారులు వెల్లడించారు.
బోర్డు తీసుకున్న నిర్ణయం ప్రకారం, తొలుత ఆరు నెలలపై ఉద్యోగులను సెలవుపై పంపించే అధికారం రాజీవ్ బన్సాల్‌కే ఉంటుంది. ఆపై సెలవును రెండు సంవత్సరాలకు, ఆపై అవసరమైతే ఐదేళ్ల వరకూ పొడిగించేందుకు కూడా సీఎండీకి అధికారం ఉంటుంది.