పెట్టుబడులపై అత్యధిక రాబడులను రెసిడెన్షియల్ ప్లాట్స్ సృష్టిస్తున్నాయి. దీనికి పెద్ద నగరాలలో తక్కువ సంఖ్యలో ప్లాట్స్ అందుబాటులో ఉండటం కూడా ఓ కారణం అని హౌసింగ్ డాట్ కామ్, మకాన్ డాట్ కామ్, ప్రాప్ టైగర్ డాట్ కామ్ సీఈవొ ధృవ్ అగర్వాల అన్నారు.
కోవిడ్-19 మహమ్మారి కాలంలో ఇండిపెండెంట్ ఫ్లోర్లు, ప్లాట్లకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. పెద్ద నగరాలలో ఔట్‌స్కర్ట్స్‌లో ఈ తరహా ప్రాజెక్టులను ఆవిష్కరించడం ద్వారా డెవలపర్లు డిమాండ్‌ను అందుకునేందుకు ప్రయత్నిస్తున్నారు అని అగర్వాల్ అన్నారు.
ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, పూనె, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్‌లో సాధారణంగా ప్లాట్స్ కొనుగోలు కన్నా అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత చూపుతున్నారు. ఇందుకు కార్‌పార్కింగ్, పవర్ బ్యాకప్, సెక్యూరిటీ, క్లబ్, జిమ్, స్విమ్మింగ్ పూల్, గార్డెన్ ఏరియా వంటివి కూడా కారణమే.
అంకితా సూద్, హెడ్ ఆఫ్ రీసెర్చ్, మకాన్ డాట్ కామ్, హౌసింగ్ డాట్ కామ్, ప్రాప్ టైగర్ డాట్ కామ్ మాట్లాడుతూ, గురుగ్రామ్‌తో పాటుగా దక్షిణాది రాష్ట్రాలైన హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో రెండంకెల వృద్ధి రెసిడెన్షియల్ ప్లాట్స్ పరంగా 2018 తరువాత కనిపిస్తుంది. ఈ నగరాల్లో భూముల ధరలు 13-21% వృద్ధి చెందుతున్నాయి. అదే సమయంలో అపార్ట్‌మెంట్ ధరలు 2-6% మాత్రమే పెరిగాయి. విధానపరమైన మార్పులు, మహమ్మారి వంటివి రాబోయే త్రైమాసాలలో డిమాండ్‌ను మరింతగా పెంచనున్నాయి అని అన్నారు.