డుయో నితిన్, భరత్ దర్శకత్వం వహించగా, మాంక్స్ & మంకీస్ బ్యానర్ నిర్మించారు. ఏప్రిల్ 11న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. సినిమా గురించి ప్రదీప్ మాట్లాడుతూ, నా మొదటి సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? అనే సినిమా తర్వాత గేప్ లేకుండా అవకాశాలు వచ్చాయి. చాలామంది ఎందుకు చేయలేదు అని అడిగారు. కానీ ఆ షూటింగ్ టైంలో కాలిగి గాయమైంది. ఆపరేషన్ అయ్యాక కోలుకుని ఈ సినిమా చేశాను. అందుకే నటుడిగా గేప్ వచ్చింది అన్నారు.
మైత్రీ మూవీస్ సంస్థ మా సినిమాను విడుదలచేస్తోంది. అయితే జాక్, జాట్, గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి పెద్ద సినిమాలు కూడా అదేరోజు విడుదలవుతున్నాయి. అయినా వేటికవే భిన్నమైన సినిమాలు. మా సినిమాకు వస్తే మాత్రం పూర్తి వినోదాన్ని ఇస్తాం. ఇటీవలే సెన్సార్ వారు కూడా చూశాక చాలాకాలం తర్వాత ఎంటర్ టైన్ మెంట్ సినిమా చూశామంటూ కితాబిచ్చారు. ఇందులో తెలుగు అమ్మాయి దీపిక పిల్లి నాయికగా నటించింది. రథన్ సంగీతం సమకూర్చారని తెలిపారు.