గ్యాడ్జెట్స్ నుంచి హోమ్ అప్లైన్స్ వరకు.. ఫ్లిఫ్‌కార్ట్ ఫ్లిప్‌స్టాట్ డేస్ సేల్

శనివారం, 1 జూన్ 2019 (15:36 IST)
జూన్ ఒకటో తేదీ నుంచి ఫ్లిఫ్ కార్ట్ నుంచి భారీ ఆఫర్లు ప్రకటించింది. భారీ ఆఫర్ల కింద ల్యాప్‌టాప్, స్మార్ట్‌ఫోన్, గ్యాడ్జెట్స్ అనే పలు వస్తువులపై ఆఫర్ ప్రకటించింది. ఫ్లిఫ్ కార్ట్ అందించే ''ఫ్లిప్‌స్టాట్ డేస్'' సేల్ పేరిట ఈ ఆఫర్లను కస్టమర్లకు అందజేయనుంది. ఈ ఆఫర్ జూన్ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు వుంటుంది. జూన్ 1 అర్థరాత్రి నుంచి ఈ ఆఫర్ ఫ్లిప్‌కార్టులో అందుబాటులో వుంటుంది. 
 
ఈ ఫ్లిఫ్ కార్ట్ ఫెస్టివల్‌లో గ్యాడ్జెట్స్ ప్రత్యేక ఆఫర్లలో లభిస్తాయి. యాక్సిస్ బ్యాంక్ ద్వారా ఫ్లిప్‌కార్ట్ చేతులు కలపడం ద్వారా యాక్సిస్ క్రిడెట్ కార్డులు, డెబిట్ కార్డులపై పది శాతం ఇన్‌స్టంట్ ఆఫర్లు వున్నట్లు సంస్థ ప్రకటించింది. 
 
ఈ ఆఫర్ల ద్వారా హెడ్‌ఫోన్, పవర్ బ్యాంక్ వంటి వస్తువులు 80 శాతం వరకు డిస్కౌంట్‌లో లభిస్తాయి. రూ.12,990 నుంచి ల్యాప్ టాప్‌, రూ.99ల నుంచి పవర్ బ్యాంక్, హెడ్ ఫోన్‌లు ప్రారంభం అవుతున్నాయి. ఇక హోమ్ అప్లైన్స్‌కు కూడా 70 శాతం మేర డిస్కౌంట్ ప్రకటించినట్లు ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు