ఆన్‌లైన్ షాపింగ్‌లో డిజిటల్ కెమెరాలను బుక్ చేస్తే బండరాళ్లు వచ్చాయి. దీంతో కస్టమర్ విస్తుపోయాడు. ఈ మాయాజాలం ఆన్‌లైన్ సంస్థ ఫ్లిప్‌కార్టులో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా, భగత్‌సింగ్ నగర్ కాలనీకి చెందిన చీర్ల యాదిసాగర్ ఈ నెల 11వ తేదీన జీఎస్టీతో కలిపి రూ.48,990 విలువ గల కెనాన్ కంపెనీ డిజిటల్ కెమెరాను ఫ్లిప్‌కార్డు ఆన్‌లైన్ షాపింగ్‌లో కొనుగోలు చేశాడు.
ఆ తర్వాత తేరుకుని కొరియర్ సంస్థను ప్రశ్నిస్తే, తమకు సంబంధం లేదని చెప్పేశాడు. దీంతో బాధితుడు రాళ్లతో వచ్చిన ఫ్లిప్‌కార్డు బాక్స్‌తో జిల్లాకేంద్రంలోని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసులు కూడా కేసు నమోదు చేస్తాంగానీ, చర్యలు తీసుకోలేమని, కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలంటూ ఉచిత సలహా ఇచ్చారు.