దేశంలో 45వేల గ్రామాలకు ఇప్పటికీ 4జీ సేవలు అందట్లేదని కేంద్ర ఐటీ శాఖ తెలిపింది. పలు నగరాల్లో 5జీ టెక్నాలజీ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ, 45 వేల గ్రామాలకు ఇప్పటికీ 4జీ సాంకేతికత అందలేదని సాంకేతిక మంత్రిత్వ శాఖ ప్రకటించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
దేశంలోని 93 శాతం గ్రామాలు 4జీ సేవలను కలిగి ఉన్నాయని, 45 వేల గ్రామాలకు ఇంకా 4జీ సేవలు అందించాల్సి ఉందని, ఒడిశాలో అత్యధికంగా 4జీ సేవలు లేని గ్రామాలున్నాయని పేర్కొంది.