కేంద్ర ప్రభుత్వం గత ఏడాది రూ.500, రూ.1000 పాత నోట్ల చెల్లవని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆపై పాత నోట్ల స్థానంలో రూ.500, రూ.2వేల కొత్త నోట్లను ప్రవేశపెట్టిన సంగతి విదితమే. అప్పట్లో నోట్ల కొరతను అధిగమించేందుకు రూ.7.4 లక్షల కోట్ల విలువైన రెండువేల రూపాయల నోట్లను ఆర్బీఐ ముద్రించింది. ప్రస్తుతం ప్రజల మధ్య 15.22 లక్షల కోట్ల లావాదేవీలు జరుగుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది.