భారత రిజర్వు బ్యాంకు ఆమోదించి, విడుదల చేసిన పది రూపాయల నాణేన్ని స్వీకరించేందుకు నిరాకరించేవారిపై సెక్షన్ 124(ఏ) కింద దేశద్రోహం కేసు నమోదు చేయాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిలిబిత్ జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీచేసింది.
ఈ కోర్టు తీర్పు వివరాలను పరిశీలిస్తే... పుల్కిత్ శర్మ అనే ఓ వ్యక్తి బరేలీలో ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. ఆయన దుకాణదారుల నుంచి ఆయన రూ.10 నాణేలు తీసుకునే వాడుకానీ, ఆయన వద్ద నుంచి తిరిగి వాటిని తీసుకునేందుకు ఎవ్వరూ అంగీకరించేవారు కాదు.
ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో చేరి వాట్సాప్ ద్వారా పలువురి వద్దకు వెళ్లింది. చివరకు జిల్లా వ్యాప్తంగా ఈ వార్త హల్ చల్ చేయడంతో దీనిపై జిల్లా న్యాయమూర్తి స్పందించారు. రూ.10 నాణేనికి చట్టబద్ధత ఉందని, ఆర్బీఐ ఆమోదించిన ద్రవ్యాన్ని నిరాకరిస్తే చట్టపరంగా తప్పు చేసినవారవుతారని అలాంటి వారిపై దేశద్రోహం శిక్ష నమోదు చేయవచ్చని చెప్పారు.