ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు అప్రెంటీస్ ట్రైనీలుగా పని చేయాల్సి ఉంటుంది. అర్రెంటీస్ యాక్ట్ 1961 ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు ఉపకార వేతనం చెల్లించనున్నారు. ట్రైనింగ్‌కు ఎంపికైన అభ్యర్థులు సొంతంగానే వసతి, ప్రయాణ సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
ఫిట్లర్ విభాగంలో ఐటీఐ చేసిన వారి కోసం 210 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మొదటగా అప్రంటీస్ పోర్టల్ www.apprenticeshipindia.orgలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం అధికారిక వెబ్ సైట్లో సూచించిన విధంగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 13లోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.